Thursday, March 28, 2024

మీకు గ్యాస్ కనెక్షన్ కావాలా?.. ఇలా పొందండి

మీరు కొత్తగా గ్యాస్ సిలిండర్ పొందాలని భావిస్తున్నారా? గ్యాస్ కనెక్షన్ పొందిందేకు ఇబ్బందులు పడుతున్నారా?  అయితే ఈ వార్త మీకోసమే. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశం ఉంది. దీని కోసం రోజుల పాటు వేచి చూడాల్సిన పని లేదు. ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. కేవలం ఆధార్ కార్డుతో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందొచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఎలాంటి ఇతర డాక్యుమెంట్లు లేకపోయినా కూడా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కర్లేదు. అయితే, ఇలా అడ్రస్ ప్రూఫ్ లేకుండా పొందిన గ్యాస్ సిలిండర్ నాన్ సబ్సిడీ కిందకు వస్తాయి. మీరు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చిన తర్వాత దీన్ని మళ్లీ సబ్సిడీ సిలిండర్ కిందకు మార్చుకోవచ్చు. ఈ మేరకు ఇండియాన్ ఆయిల్ కంపెనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement