Friday, December 6, 2024

జ‌ర్మ‌నీలో మ‌ళ్లీ లాక్‌డౌన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జర్మనీలో ఏకంగా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో జ‌ర్మ‌నీలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈస్ట‌ర్ సెల‌వు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్ర‌జ‌లు ఇళ్లకే ప‌రిమితం కావాల‌ని ప్రభుత్వం ఆదేశించింది.

థర్డ్ వేవ్ క‌రోనా ఉదృతిని అడ్డుకునేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జర్మనీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ప్ర‌స్తుతం జ‌ర్మ‌నీలో యూకే కోవిడ్ వేరియంట్ తీవ్ర ప్ర‌భావం చూపుతోందన్నారు. కొత్త వైర‌స్ ప్ర‌బ‌లుతోంద‌ని, అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని మెర్కల్ తెలిపారు. ఏప్రిల్ 18 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బందులు వస్తున్నా.. ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, అందుకే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు మెర్కెల్ పేర్కొన్నారు. 

 

Advertisement

తాజా వార్తలు

Advertisement