Sunday, December 10, 2023

కొల‌రాడోలోని గే నైట్ క్ల‌బ్ లో కాల్పులు.. ఐదుగురు మృతి

కొల‌రాడోలోని గే నైట్ క్ల‌బ్ లో కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో ఐదుగురు మ‌ర‌ణించారు. 18మందికి గాయాలు అయ్యాయి. శనివారం రాత్రి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి 11.57 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్ 20న ‘ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ (TDOR)’ జరుపుకుంటుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ సాయుధుడు కాల్పులు జరుపగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement