Tuesday, April 23, 2024

వైజాగ్ లో ‘గ‌ని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – గెస్ట్ గా ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’

గ‌ని చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వ‌హించ‌నున్నారు చిత్ర మేక‌ర్స్. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయ‌నున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా ‘గని’ సినిమా రూపొందింది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాతో సైయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కొంతసేపటి క్రితమే అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నదియా .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తమన్నా స్పెషల్ సాంగ్ హైలైట్ గా నిలవనుంది. చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement