Wednesday, April 24, 2024

Breaking : స‌చివాల‌యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ..పీఆర్సీపై చ‌ర్చ‌..

అమ‌రావ‌తి : మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు స‌చివాల‌యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ స‌మావేశంలో 13ఉద్యోగ సంఘాలు హాజ‌రుకానున్నాయి. పీఆర్సీ నివేదిక వెల్ల‌డించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశం వాడీ వేడిగా జ‌ర‌గ‌నుంది. జీపీ ఎఫ్ ఖాతాల నుంచి న‌గ‌దు మాయంపై అధికారుల‌ను ఉద్యోగ సంఘాలు నిల‌దీయ‌నున్నారు. ఉద్యోగుల ఆర్థిక ప‌ర‌మైన అంశాలు,స‌మ‌స్య‌ల‌పై కౌన్సిల్ లో చ‌ర్చ‌కు రానుంది. పీఆర్సీ కోసం స‌చివాల‌యంలో 5గంట‌లు నిర‌స‌న చేశారు ఉద్యోగ సంఘాల నేత‌లు. మైలేజీ కోస‌మే నిర‌స‌నలు అని తెలిపారు స‌చివాల‌య ఉద్యోగ‌సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి. పీఆర్సీ నుంచి త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే విమ‌ర్శ‌లు అంటున్నారు జేఏసీ నేత‌లు. పీఆర్సీపై సీఎం జ‌గ‌న్ ని అడ‌గాల‌ని జీఏసీ స‌ర్వీసెస్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ‌శిభూష‌ణ్ తెలిపారు. కౌన్సిల్ భేటీ త‌ర్వాత భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement