Thursday, April 25, 2024

Funny Moment: అక్క‌డ స్పేస్ లేదు.. అత‌ను క్రియేట్ చేసుకున్నాడు.. వీడియో వైర‌ల్‌

అప్పుడ‌ప్పుడు మ‌నం చూస్తుంటాం.. పండుగ స‌మ‌యాల్లో కిక్కిరిసి పోయిన ట్రైన్లు, బ‌స్సుల్లో జ‌ర్నీ ఎట్లుంట‌దో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా త‌ర్వాత అంత‌గా ప్ర‌యాణికుల‌ను కిక్కిరిసి వెళ్ల‌నివ్వ‌డం లేదు. కానీ, ఈ మ‌ధ్య కొన్ని ట్రైన్ల‌లో మ‌రీ ర‌ద్దీ ఎక్కువ‌గానే ఉంటోంది. జెనరల్ బోగీలు ఇసుకవేస్తే రాలనంత నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో చాలా దూరం ప్రయాణిచేవాళ్లు కాళ్ల నొప్పులతో ఎంతో ఇబ్బంది పడాల్సిందే. కానీ తాజాగా ఓ వ్యక్తి ట్రైన్ లో సీటు దొరక్క త‌ను చేసిన పనిని ఎవ‌రో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో దాన్ని చూసిన వారు తెగ న‌వ్వుకుంటూ.. షేర్ చేస్తున్నారు. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ లా ఇక్కడ స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకున్నాడు అన్నట్టు అక్కడ సీటు లేకున్నా ఓ వ్యక్తి సీటును ఏర్పాటు చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కిన వ్యక్తి జ‌నంతో కిట‌కిట‌లాడ‌డంతో నిరాశ చెందలేదు. తన మొదడుకు పనిపెట్టాడు. దాంతో అతడికి ఓ ఐడియా తట్టింది వెంటనే తన బ్యాగ్ లో ఉన్న బెడ్ షీట్ తీసి ట్రైన్ లో ఉండే లగేజ్ హెల్డర్ కు ఊయల లెక్క‌ కట్టుకున్నాడు. ఇక అందులో హాయిగా పడుకున్నాడు. దాంతో ట్రైన్ లో కూర్చుకున్నవాళ్లు అతడినే చూస్తూ షాక్ అయ్యారు.

ఈ వీడియో ప్ర‌స్త‌తుం నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా భారతీయుల తెలివి ముందు ఎవరూ సాటిరాలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి. దాంతో అవి చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement