Wednesday, April 24, 2024

భారత రక్షణ వ్యవస్థ పటిష్టం, ఆర్మీ శాటిలైట్‌ కోసం 8,357 కోట్ల ఫండ్​

భారత సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రూ.8,357 కోట్ల విలువైన ఆర్మీ శాటిలైట్‌, ఇతర పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్‌ అకిజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ), సాయుధ దళాల మూలధన సేకరణ ప్రతిపాదనలకు రూ.8,357 కోట్లకు అవసరమైన అంగీకారన్ని ఆమోదించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌కు చేయూత అందించేలా.. ఈ ప్రతిపాదనలన్నీ భారతదేశంలో స్వదేశీ డిజైన్‌, అభివృద్ధి, తయారీపై దృష్టి సారించాయి. ఇండియన్‌ ఐడీడీఎం కేటగిరీ కింద ఆమోదించారు. డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ ద్వారా అందించిన ఇమేజ్‌ ఇంటెన్సిఫైయర్‌, లైట్‌ వెహికిల్స్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ ఫైర్‌ కంట్రోల్‌ రాడార్‌ (లైట్‌), జీసాట్‌ 7బీ ఉప గ్రహాల సేకరణ అంశాలు ఉన్నాయి.

పెరగనున్న ఆర్మీ సామర్థ్యం
ఈ పరికరాలు, వ్యవస్థల కొనుగోలు మెరుగైన దృశ్యమానత, మెరుగైన చలనశీలత, మెరుగైన కమ్యూనికేషన్‌, శత్రు విమానాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధత మరింత మెరుగుపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు పాత్‌ బ్రేకింగ్‌ ఇనిషియేటివ్‌లో ఐడెక్స్‌ స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల నుంచి రూ.380 కోట్ల కొనుగోళ్లకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ అంగీకారాన్ని అందించింది. దేశంలో తయారీ ప్రోత్సహించడానికి రక్షణలో స్వయం విశ్వాసాన్ని సాధించడానికి, రక్షణ పరిశ్రమ కోసం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి డీఏపీ-2020 పాలసీలో భాగంగా పలు కార్యక్రమాలను అమలు చేయడానికి డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఇందులో రక్షణ దళాల అన్ని ఆధునీకరణ అవసరాలు స్వదేశీ మూలాలు ఉన్నవి మాత్రమే దిగుమతి చేసుకోవడానికి మినహాయింపు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement