Friday, March 29, 2024

India: భారత్​​ జోడో యాత్రకు ఫుల్​ రెస్పాన్స్​.. నిరాడంబరంగా సాగుతున్న రాహుల్​!

కాంగ్రెస్​ నేత రాహుల్‌గాంధీ పాదయాత్ర ఇవ్వాల (ఆదివారం) 11వ రోజు ఉత్సాహంగా ముగిసింది.. కేరళలోని హరిపద్​ నుంచి ఈ యాత్ర కొనసాగించారు. కాగా, ఈ రోజు రాహుల్​ యాత్రలో ఓ ఇంట్రెస్టింగ్​ సన్నివేశం జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాహుల్​.. ఒక్కసారిగా ఆగిపోయారు. ఎందుకంటే తన ముందు నడుస్తున్న ఓ చిన్నారి కాలి చెప్పు ఊడిపోయి ఇబ్బంది పడుతోంది.. దీన్ని గమనించిన రాహుల్​ ఆ పాప దగ్గరకు వెళ్లి, కాలి చెప్పును సరిచేశారు.

దీనికి సంబంధించిన వీడియోను భారత్​ జోడో అధికారిక ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేయడంతో అది కాస్త వైరల్​గా మారింది. ఈ ట్వీట్​ని కాంగ్రెస్​ మహిళా విభాగం తాత్కాలిక అధ్యక్షురాలు డిసౌజా రీట్వీట్​ చేస్తూ.. ‘‘నిరాడంబరత, ప్రేమ, దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే రెండూ అవసరం”అని కామెంట్స్​ పెట్టారు. దీన్ని చాలామంది లైక్​ చేస్తూ.. పాజిటివ్​ కామెంట్స్​ చేస్తున్నారు.  ఇక.. సాదాసీదా వ్యక్తిగా రాహుల్​ గాంధీ అందరితో కలిసి ముందుకు సాగుతుండడంపై కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్​ వస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement