Wednesday, April 24, 2024

వీకెండ్‌ ఎఫెక్ట్​, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2కు ఫుల్ కలెక్షన్లు.. కొత్త రికార్డులు క్రియేట్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్‌ యష్ హీరోగా నటించిన చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకుంది. ఏప్రిల్‌ 14న రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాఖీ భాయ్ వయోలెన్స్‌కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు వ‌సూలు చేస్తోంది. రాఖీ భాయ్ గత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు. కాగా, ఈ వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 రికార్డుల్లో నిలిచింది.

ఓ నివేదిక ప్రకారం గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో ఏప్రిల్‌ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్ 3’ మాత్రమే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కంటే ముందుంది. మరోవైపు కేజీఎఫ్‌ 2 500 కోట్ల క్లబ్బులో చేరింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 551.83 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి. కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమా మొదటి రోజు (ఏప్రిల్ 14)న 165.37 కోట్లు వసూల్ చేసింది. రెండో రోజు 139.25 కోట్లు కొల్లగొట్టగా.. మూడో రోజు 115.08 కోట్లు వసూల్ చేసింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో 132.13 కోట్లు రాబట్టింది.

మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో కేజీఎఫ్‌ 2 551.83 కోట్లు వసూల్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమాఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి. కేజీఎఫ్ 2 హిందీలో కూడా కొత్త చరిత్ర సృష్టించింది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్లో 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. 200 కోట్ల రికార్డును అందుకోవడానికి బాహుబలి 2 సింబిమకు 6 రోజులు పడితే.. కేజీఎఫ్ 2కి ఐదు రోజులు పట్టింది. కేజీఎఫ్ 2 చిత్రం గురువారం రూ. 53.95, శుక్రవారం రూ. 46.79, శనివారం రూ. 42.90, ఆదివారం రూ. 50.35 రాబట్టింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.193.99 కోట్లు వసూల్ చేసింది. ఈరోజు ఉదయం 200ల క్లబ్‌లో చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement