Friday, April 26, 2024

నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణా తరగతులు -ఎమ్మెల్యే అరూరి

దేశ చరిత్ర లోనే మొదటిసారిగా భారీస్థాయిలో 80,039 ఉద్యోగ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 4వ తేదీ నుండి 90రోజుల పాటు వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పలు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.

ఈ ఉచిత శిక్షణా తరగతులకు హాజరయ్యే విద్యార్థులు వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో, హన్మకొండ హంటర్ రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ..2,700మంది విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్ డెవలప్మెంట్ తరగతులతో పాటు …సుమారు 2వేల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఈ అవ‌కాశాన్ఇన సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement