Saturday, April 20, 2024

తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో నలుగురు మృతి

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కారణంగా నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో మంగళవారం బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.

ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ. 50 లక్షల బీమా చెల్లించినట్టు కేంద్ర సహాయమంత్రి భారతీ పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిమ్స్ వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు. అలాగే, తెలంగాణలో 2019 నాటికి 46,464 మంది కేన్సర్ బాధితులు ఉన్నట్టు చెప్పిన మంత్రి.. ఆ సంఖ్య ప్రస్తుతం 48,775గా ఉందన్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement