Tuesday, April 23, 2024

లాస్ ఏంజెల్స్ లో కాల్పులు : న‌లుగురు మృతి

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో న‌లుగురు మృతిచెందారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ లోని ఇంగ్లెవుడ్ లోని ఒక ఇంట్లో పార్టీ జరుగుతుండగా కొందరు దుండగులు కాల్పులు జరిపారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పార్టీ జరుగుతుండగా….. ఈ కాల్పుల్లో ఇంట్లో పార్టీ చేసుకుంటున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement