Saturday, April 20, 2024

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన యువ‌రాజ్ దంప‌తులు

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ దంప‌తులు. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో ఈ శుభ‌వార్త‌ని పోస్ట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గోప్య‌త‌ని గౌర‌వించాల‌ని తెలిపారు. దేవుడు మాకు కుమారున్ని ఇచ్చాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి కృతజ్ఙతలు చెప్పుతూ.. మా గోప్యతను గౌరవించాలని అడుగుతూ.. మా బిడ్డను ప్రపంచంలోకి వెల్‌ కమ్‌ చెబుతున్నాము. లవ్‌, హాజెల్, యువరాజ్‌ ” అంటూ యూవీ పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వార్తతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ అందరూ ఖుషీ అవుతున్నారు. యువరాజ్‌ సింగ్‌ తండ్రి అయినందుకు అందరూ అభినందనలు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement