Friday, June 2, 2023

మాజీ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని ప్ర‌శ్నించిన – ఈడీ

పంజాబ్ మాజీ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఇసుక అక్ర‌మ మైనింగ్ కేసులో ఇంత‌కుముందు చ‌న్నీ మేన‌ల్లుడు భూపీంద‌ర్ సింగ్ హ‌నీ వ‌ద్ద రూ.10 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న అనంత‌రం భూపీంద‌ర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. గ‌తంలో ఇదే వ్య‌వ‌హారంలో చ‌న్నీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసినా ఆయ‌న ద‌ర్యాప్తు అధికారుల ఎదుట హాజ‌రు కాలేదు.
హ‌నీతో చ‌న్నీకి ఉన్న సంబంధాలు, ఆయ‌న పంజాబ్ సీఎంగా ఉండ‌గా హ‌నీ సీఎంఓను ప‌లుమార్లు సంద‌ర్శించ‌డం గురించి ఈడీ అధికారులు చ‌న్నీని ప్ర‌శ్నించారు. ఇసుక మైనింగ్ కేసుకు సంబంధించిన కొంద‌రు అధికారుల బ‌దిలీపైనా ఈడీ ప్ర‌తినిధులు చ‌న్నీని ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. ఇసుక అక్ర‌మ మైనింగ్ కేసులో హ‌నీ స‌హా ఇత‌రుల‌పై ఈడీ చార్జిషీట్ దాఖ‌లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement