Thursday, March 28, 2024

Breaking: మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ విడుదల

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బోడిగ శోభ బెయిల్ పై కరీంనగర్  జైల్ నుండి శనివారం విడుదల అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు అరెస్ట్ అయిన శోభకు హైకోర్టు బైయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీక‌త్తుతో శోభ‌ను విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు విడుదలైయ్యారు.

కాగా జనవరి 2న బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఉద్యోగుల బ‌దిలీల విష‌యంలో ఉన్న జీవో నెంబ‌ర్ 317ను స‌వ‌రించాల‌ని జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ దీక్ష‌లో బండి సంజ‌య్, బొడిగె శోభ‌తో స‌హా మొత్తం 17 మందిని కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇటీవ‌ల బండి సంజ‌య్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. తాజాగా బొడిగె శోభ కూడా త‌న రిమాండ్ ను ర‌ద్దు చేయాల‌ని హై కోర్టులో అత్య‌వ‌స‌న పిటిష‌న్ వేసింది. ఈ పిటిష‌న్ పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. బొడిగే శోభ రిమాండ్ పై స్టే విధించింది. అలాగే బొడిగె శోభ అరెస్టు గురించి పూర్తి వివ‌రాలు హై కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌ను ఆదేశించింది. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే నెల 7 తేదీకి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement