Saturday, June 19, 2021

బీజేపీలోకి ఈటల.. రేపే రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ నెల 14న బీజేపీలో ఈటల చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు ముఖ్యనేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Advertisement

తాజా వార్తలు

Prabha News