Friday, March 29, 2024

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ షేన్ వార్న్ ..

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ షేన్ వార్న్.. ఆయ‌న పాదానికి తీవ్ర గాయం అయింది. త‌న కుమారుడితో క‌లిసి బైక్ పై వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు గాయం చిన్నదే అని భావించిన షేన్ వార్న్ ఆసుపత్రికి వెళ్లలేదు. ఉదయం నిద్రలేచే సమయానికి నొప్పి ఎక్కువయింది. దీంతో, ఆయన ఆసుపత్రికి వెళ్లారు. తనకు గాయమయిందని, నొప్పి తీవ్రంగా ఉందని వార్న్ వైద్యుల‌కి తెలిపాడు .కాగా మరోవైపు వచ్చే నెల 8 నుంచి బ్రిస్బేన్ లో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో షేన్ వార్న్ కామెంటరీ చెప్పాల్సి ఉంది. ఇలోగా ఆయన కోలుకుంటారని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement