Tuesday, March 26, 2024

ఫుట్ బాల్ స్టార్ లియోన‌ల్ మెస్సీ రికార్డ్ .. ఏడోసారి బాల‌న్ డి ఓర్ అవార్డు ..

ప్ర‌తిష్టాత్మ‌క బాల‌న్ డి ఓర్ అవార్డును ఏకంగా ఏడోసారి అందుకుని చ‌రిత్ర సృష్టించాడు అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోన‌ల్ మెస్సీ.. అంతకుముందు 2009, 2010, 2011, 2012, 2015, 2019 సంవత్సరాల్లోనూ ఈ అవార్డును అందుకున్న మెస్సీ తాజాగా ప్యారిస్‌లో జరిగిన వేడుకల్లో మరోమారు ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మొత్తం 30 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, చివరికి రాబర్ట్ లెవాండోస్కీ, జోర్గిన్హోలను వెనక్కి నెట్టి మెస్సీ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.

మరో దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఐదుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అవార్డు అందుకుంటున్నప్పుడు అదే చివరిదని భావించానని పేర్కొన్నాడు. ‘కోపా అమెరికా కప్’ను గెలుచుకోవడం వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నాడు. ఈ ఏడాది జరిగిన ‘కోపా అమెరికా కప్’ ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా కప్పును ఎగరేసుకుపోయింది. అర్జెంటీనా ఓ మెగా టైటిల్‌ను అందుకోవడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దేశానికి కప్పు అందించిపెట్టిన మెస్సీపై ప్రశంసలు కురిశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement