Friday, April 19, 2024

ఒడిదుడుకుల‌కు లోనై – స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన షేర్ మార్కెట్స్

నేటి షేర్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మా స్టాకులు మార్కెట్లను వెనక్కి లాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 55,702కి చేరింది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 16,682 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా (4.19%), ఇన్ఫోసిస్ (3.28%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.76%), టాటా స్టీల్ (2.10%), విప్రో (1.91%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.33%), సన్ ఫార్మా (-2.86%), నెస్లే ఇండియా (-2.75%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.60%), రిలయన్స్ (-1.86%) టాప్ లూజర్స్ మిగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement