Friday, March 15, 2024

6 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు

ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న కృష్ణానదిపై ఉన్న పులిచింతల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని 16వ నంబర్ క్రస్ట్ గేట్ విరిగిపోయి వరదనీటిలో కొట్టుకుపోవడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం నాడు అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్ట్ నుండి పెద్ద మొత్తంలో నీటిని పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. గేటు ఊడిపోవడంతో పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 6 లక్షల క్యూసెక్కుల అదనపు వరద నీరు విడుదల అవుతోంది.

కాగా పులిచింతల నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో నది ఒడ్డున ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద ప్రవాహం రేటు 6 లక్షల క్యూసెక్కుల దాటే అవకాశం ఉన్నందున, జిల్లాలోని నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. కాగా జలవనరుల శాఖ అధికారులు విరిగిన గేటు వద్ద ప్రత్యామ్నాయ స్టాప్-లాక్ గేట్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో రేపే పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement