Thursday, April 25, 2024

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాల‌లు – హై క‌మాండ్ సీరియ‌స్

హైక‌మాండ్ వ‌ర్సెస్ టి.కాంగ్రెస్ మ‌ధ్య విబేధాలు త‌లెత్తుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాల‌లు చెల‌రేగాయి. హైక‌మాండ్ ఆదేశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు సీనియ‌ర్లు. ఇప్పుడు ఎవ‌రు ఎవ‌రినీ సూచ‌న‌లు అడ‌గ‌డం లేదు…అంతేకాదు ఎవ‌రో ఫోన్ చేస్తే మేం భ‌య‌ప‌డేది లేద‌ని సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. వీహెచ్ పిలిచారు..నేను వెళ్తున్నా అని తెలిపారు. కాగా హోట‌ల్ అశోక‌లో సీనియ‌ర్ల మీటింగ్ జ‌రిగింది.సీనియ‌ర్ల మీటింగ్ పై హైక‌మాండ్ సీరియ‌స్ అయింది. స‌మావేశం ర‌ద్దు చేసుకోవాల‌ని హైక‌మాండ్ ఆదేశాలు జారీ చేసింది.. స‌మ‌స్య ఉంటే నేరుగా పార్టీ అధినేత్రి సోనాయాగాంధీ లేదా రాహుల్ కి అయినా చెప్పండని బోస్ రాజు తెలిపారు. స‌మావేశాల‌తో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టొద్ద‌న్నారు. అయితే హైక‌మాండ్ ను లెక్క‌చేయ‌ని విధేయుల ఫోరం. పీసీసీలో క‌మిటీల‌న్నీ నామ మాత్ర‌మే అన్నారు జ‌గ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి ముసలం మరింతగా ముదురుతోంది. పార్టీ అధిష్టానంపై కొంతమంది నేతలు అసంత్రుప్తిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ సీనియర్లలో అసంత్రుప్తి ఉంది. పాత కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత తక్కడం లేదని వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. వీహెచ్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement