Saturday, April 20, 2024

భీకర పోరాటం ఐదుగురు జవాన్లు మృతి

ఛత్తీ‌స్గఢ్‌ ‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరిపిన 760 మంది జవాన్లకు 250 మంది మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు మొదలయ్యాయి.

శనివారం మధ్యాహ్నం నుంచే బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాలను డీఆర్జీ, ఎస్టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా ప్రత్యేక బలగాలు జల్లెడపడుతున్నా యి. ఈ ఈ క్రమంలో అర్థం రాత్రి పోలీసులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాల మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 21 మందిని బీజాపూర్‌ దవాఖానాకు తరలించారు. మరోవైపు చనిపోయిన ఐదుగురు జవాన్లలో కేవలం ఇద్దరి మృతదేహాలే లభించాయని, వారి మృతదేహాలను జగదళ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ నకు తరలించారని చెప్పారు. మిగతా వారి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు, కనిపించకుండా పోయిన వారి జాడ కనిపెట్టేందుకు ఆపరేషన్ జరుగుతోందని అంటున్నారు.

మరోవైపు నక్సల్స్‌ 9 మంది మృతిచెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. సుక్మా సరిహద్దులకు సీఆర్పీఎఫ్ డీజీపీ వచ్చారని ఛత్తీస్ గఢ్ పోలీసులు చెబుతున్నారు.. ఒక మహిళా నక్సల్‌ మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఘటనపై ఛత్తీ‌స్గఢ్ సీఎం తో పాటు ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement