Friday, March 29, 2024

Breaking: నాంపల్లిలో గగన్ విహార్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లోని నాంపల్లిలోని గగన్ విహార్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో నాంపల్లి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement