Tuesday, April 23, 2024

ఆస్ప‌త్రి సెల్లార్ లో అగ్నిప్ర‌మాదం.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం

ఫియోనిక్స్ ఆస్ప‌త్రి సెల్లార్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. దాంతో సిబ్బంది వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి ఫిర్యాదు చేశారు.దాంతో అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్‌లతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement