Friday, March 31, 2023

క‌ల్యాణ ల‌క్ష్మీ, ద‌ళిత‌బందులో చేతి వాటం…ప‌లువురికి టిక్కెట్లు గ‌ల్లంతు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని అమలు చేస్తున్న దళితబంధు, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో ముడుపులు తీసుకున్నా రన్న ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు భారాస ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేటు- వేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు- తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న ఈ ఐదుగురు శాసన సభ్యులకు పార్టీ టికెట్లను నిరాకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయని భారాస వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీ-వల ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తనకు అత్యంత సన్నిహితులైన సీనియర్‌ నేతలతో చర్చల సందర్భంగా చెప్పినట్టు- విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు, ఆదిలా బాద్‌ జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ముగ్గురు భారాస ఎమ్మెల్యేలు దళితబంధు, కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుని వాటిని మంజూరు చేయించినట్టు- సీఎంవోకు ఫిర్యాదులు అందాయని సమాచారం.

- Advertisement -
   

ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేలను ఇటీ-వల హైదరాబాద్‌కు పిలిపించిన సీఎం కేసీఆర్‌ వారిపై ఒక రేంజ్‌లో తలంటు-పోసినట్టు- చెబుతున్నారు. రెక్కాడినా డొక్కాడని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాం తాల్లో దళితులున్నారని, వారి అభ్యున్నతికి దళితబంధు ప్రారంభిస్తే అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది పోయి కక్కుర్తిపడితే ఎలా అని కేసీఆర్‌ వారిని నిలదీసినట్టు- భారాసలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు దళితబంధు, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం కట్టబెట్టింది. దీన్ని అదనుగా తీసుకుని అక్కడక్కడ ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం కొన్ని తప్పిదాలకు పాల్పడినట్టు- ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి.
కొన్ని నియోజక వర్గాల్లో ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు నిధుల మంజూరు వరకు నిబంధనలకు తిలోదకాలిచ్చారని ఇందులో కొందరు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు- ప్రభుత్వం గుర్తించినట్టు- తెలుస్తోంది. ఈ పథకాల అమల్లో జరిగిన పొరపాట్లకు సంబంధించి కొందరు పార్టీ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు పిలిపించి హెచ్చరించిన సమయంలో కేసీఆర్‌ కొన్ని ఘా-టైన వ్యాఖ్యలు కూడా చేశారని, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తనకు పూర్తి సమాచారం ఉందన్న విషయం కూడా అన్నారని చెబుతున్నారు. దళితబంధు అమలు ఎలా జరిగిందో తన దగ్గర వివరాలు ఉన్నాయని వారితో అన్నట్టు- సమాచారం. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు మూడు రోజుల క్రితం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ దళితబంధు, కల్యాణలక్ష్మి పథకాల అమల్లో దుర్వినియోగం జరిగిన విషయం వెల్లడిస్తూ ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తప్పులు జరిగాయని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుంచి ముడుపులు తీసుకున్నారన్న పక్కా సమాచారం తన దగ్గర ఉందని ముఖ్యమంత్రి చెప్పడంతో సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఖంగుతి న్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు. దళిత వర్గాల అభ్యున్నతికి దళిత బంధు పథకం కింద స్వయం ఉపాధి కోసం ఎటు-వంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంటే దాంట్లో కూడా ముడుపులు తీసుకోవడం ఏంటని కేసీఆర్‌ నిలదీసినట్టు- తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ముడుపులు చేతులు మారుతు న్నాయన్న పక్కా సమాచారం అందడంతో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగి వేగుల ద్వారా సమాచారాన్ని సేకరించినట్టు- సమా చారం. ఈ తరహా విధానం పునరావృతమైతే ఉపేక్షించమని కూడా కేసీఆర్‌ ప్రగతిభవన్‌ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. అసెంబ్లీ ఎన్నికల్లో 99శాతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే తిరిగి ఎంపిక చేస్తానన్న కేసీఆర్‌ దళితబంధు అమల్లో అవినీతికి పాల్పడిన వారికి మాత్రం పోటీ-చేసే అవకాశం ఉండవన్న సంకేతాలివ్వడంతో ఆరోపణలు ఎదుర్కొంటు-న్న ఎమ్మెల్యేలు మరో దారి చూసుకునే పనిలో ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement