Saturday, April 20, 2024

అభిమానం.. ఆహా అనాల్సిందే.. వరి నారులో డీఎంఆర్

పెద్దపల్లి జిల్లాలో ఓ అభిమాని విచిత్రంగా త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. తన‌కు నచ్చిన నేతపై ఎంత అభిమానం ఉందో తెలియజేసెందుకు చేసిన పని అందరి చేత ఆహా అనిపిస్తుంది.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామ సర్పంచ్ గుండేటి మధు ఎవరూ చాటని విధంగా వినూత్న రీతిలో త‌న‌కు న‌చ్చిన‌ నేత అయిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని క‌న‌బ‌రిచేలా ఈ ప‌నిచేశాడు.

త‌న‌కు ఎంత అభిమానం ఉందని తన పొలంలో వేసిన వరినార్లలో అభిమాన నేత డీఎంఆర్ పేరును నారుమడి రూపంలో వేసి అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడిది అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. నారు మ‌డి పెరిగి పెద్ద‌దై.. ప్ర‌త్యేకంగా ఆ పేరు క‌నిపిస్తండ‌డంతో అంతా ఆశ్య‌ర్యానికి గుర‌వుతున్నారు. ఆ స‌ర్పంచ్ చేసిన ప‌నిని మెచ్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement