Friday, April 26, 2024

కేసీఆర్ పై అభిమానం – త‌మ చిన్నారికి కేసీఆర్ గా నామ‌క‌ర‌ణం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు నేడు. ఈసంద‌ర్భంగా ఆదిలాబాద్ జిల్లా ముక్రా కే గ్రామానికి చెందిన ఓ కుటుంబ స‌భ్యులు కేసీఆర్ పై అభిమానంతో త‌మ చిన్నారి బాబుకు కేసీఆర్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గ్రామానికి చెందిన వాగ్మారే చంద్రకాంత్, భాగ్యశ్రీ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టాడు. గురువారం నామకరణంలో భాగంగా బాబుకు కేసీఆర్‌గా పేరు పెట్టారు. గిఫ్ట్స్ ఏ స్మేల్ లో భాగంగా సర్పంచ్ మీనాక్షి ఇందుకు అవసరమైన వస్తువులను అందజేశారు.
ముఖ్యమంత్రి పుట్టినరోజు పురస్కరించుకొని గ్రామస్తులు హోమం నిర్వహించడంతో పాటు పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement