Sunday, March 26, 2023

Breaking: ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాలోని నర్సింగాపూర్ లో తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల మృత‌దేహాల‌ను బావిలో నుంచి వెలికితీశారు. మృతులు తండ్రి జలపతిరెడ్డి, పిల్లలు ప్రణీత (11), మధుమిత (9)గా గుర్తించారు. అయితే జలపతిరెడ్డి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement