Tuesday, October 8, 2024

Bhopal: ఘోర రోడ్డుప్రమాదం… ఏడుగురు దుర్మరణం..

ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన సిమెంట్‌ ట్యాంకర్‌ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతో పాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మద్వాస్ ప్రాంతంలోని డోల్ గ్రామంలో ఈరోజు సిమెంట్‌ కలిగిన పెద్ద ట్యాంకర్‌ వాహనం నియంత్రణ కోల్పోయింది.

బొలెరో వాహనాన్ని ఢీకొట్టి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణించిన ఎనిమిది మందిలో ఆరుగురు చనిపోయారు. అలాగే స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తి కూడా సిమెంట్‌ ట్యాంకర్‌, బొలెరో వాహనం మధ్య నలిగి మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement