Tuesday, March 26, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందిన ఘటన జార్ఖండ్​లో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ స్కార్పియో వాహనం ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బిశున్​పుర్​కు చెందిన అరవింద్ మిస్త్రీ అనే వ్యక్తి కుమారుడు వివాహ వేడుకను ఓ పంక్షన్​ హాల్​లో ఘనంగా నిర్వహించారు. అనంతరం కారులో బయలుదేరిన ఆయన రోడ్డుపై వెళ్తున్న ఐదుగురిని తన స్కార్పియోతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఎమ్​ఎమ్​సీహెచ్​కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement