Friday, April 19, 2024

తెలంగాణలో ‘వరి’ వద్దంటే రైతుల వర్రీ…

యాసంగిలో  వరి సాగు చేయొద్దన్న ప్రభుత్వం నిర్ణయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల, జలాశయాలు ద్వారా చెరువులు,  కుంటలను నింపుకొని వరి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో.. రైతుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లు అయ్యింది. యాసంగిలో వరి వద్దని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వరి పండించ వద్దని వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులకు మార్గనిర్దేశాలను సూచించింది. దీంతో అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏ ఏ పంటలు వేస్తే ఎంత లాభం వస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నామని అంటున్నారు

ఈ ఏడాది వాన కాలంలో జిల్లాలో లక్ష 81 వేల ఎకరాలలో వరి పంటను సాగుచేశారు అలాగే గత సంవత్సరం యాసంగి లో లక్షా నలభై నాలుగు వేల ఎకరాలు లక్ష నలభై నాలుగు వేల ఎకరాలు సాగుచేశారు. ఈసారి కూడా అదే మోతాదులో వరి సాగు చేసుకోవడానికి రైతులు సిద్ధపడగా ప్రభుత్వం వారిస్తుంది దీంతో రైతులు తాము పండించే ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర రాక నష్టపోవాల్సి వస్తుందని ఆందోళనలో ఉన్నారు.

వరి సాగు కె రైతుల మొగ్గు….

జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్న రైతులకు యాసంగిలో కూడా వరిపైనే మొగ్గుచూపుతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమిలో ఆరుతడి పంటలు వేస్తే దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను వేస్తే పెట్టుబడి పోను లాభాలు తక్కువగా వస్తాయని అంటున్నారు. యాసంగిలో కూడా వరి వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే రైతాంగం ఇబ్బందుల్లో పడుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పుష్కలంగా వర్షాలు కురవగా సాగునీటి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్న సమయంలో వరి సాగును వద్దంటే ఏ పంట వేసిన లాభాలు రావని సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూడటంతోపాటు వరి సాగుకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.

- Advertisement -

ఆరుతడి పంటలపై అధికారుల అవగాహన

ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడటం ఎఫ్ సీ ఐ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం వల్ల యాసంగి లో వరినీ తగ్గించాలని ప్రభుత్వం యంత్రాంగం ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. గత 10 రోజులలో వ్యవసాయ  అనుబంధాల శాఖల అధికారులు ఆరుతడి పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాసంగి లో వేరుశెనగ. మినుములు, ఆముదాలు, జొన్నలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విత్తనాలను కూడా కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం లోని వ్యవసాయ క్షేత్రం నుండి అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

తాము అందిస్తున్న ఆరుతడి పంటలను ఒక్కొక్క రకం 50వేల ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులకు వివరించినట్లు అధికారులు చెబుతున్నారు. వేరుశెనగ, మినుములు, ఆముదాలు, జొన్నలు తదితర పంటలు సాగు విస్తీర్ణాన్ని బట్టి సాగు చేయించేందుకు రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ముందుకు వస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి యాసంగి లో ఆరుతడి పంటల ద్వారా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ఆహార సంస్థ ఇకనైనా స్పందించి వరి కొనుగోళ్లను చేపట్టి రైతులకు నష్టం కలగకుండా చూడాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రాలో TRS.. తెలంగాణ జోలికి రావొద్దంటూ రేవంత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement