Thursday, March 28, 2024

Gulab Cyclone: ప్రకృతి ప్రకోపం.. రైతన్నలకు అపార నష్టం..

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు.. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వానాకాలం పోతు పోతూ.. రైతన్నపై పిడుగులు కురిపించింది. చాలా ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈ వర్షాకాలంలో గత జూన్‌ నుంచి ఇప్పటివరకు లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో గత జూన్‌ నుంచి ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా వేస్తున్నారు. పత్తి, మొక్క జొన్న, వరి పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వేసిన పంటలు నీట మునగడంతో రైతులు వాపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలపై కూడా గులాబ్ తుపాను తీవ్ర ప్రతాపం చూపించింది. గార, ఎచ్చెర్ల, హిర, జలుమూరు, పోలాకి, సంతబొమ్మాళి, లక్ష్మినర్సుపేట, మందసం మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో వరిపంట నీటిపాలైంది. వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, మొక్కజొన్న, పత్తి, బొప్పాయి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే దశలో తుపాను కారణంగా నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement