Friday, April 26, 2024

వీర‌మ‌ల్లు కోసం భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ – ట్వీట్ చేసిన స్టంట్ మాస్ట‌ర్

ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నాడు. చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ చిత్రం కొన‌సాగుతుంద‌ట‌. మొగల్ కాలం నాటి భారీ సెట్లు .. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి. పవన్ కల్యాణ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు మళ్లీ మొదలవుతోంది.

తాజా షెడ్యూల్ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుకానుంది. అందుకు సంబంధించిన చర్చలు క్రిష్ తో పూర్తి చేసినట్టుగా ప్రముఖ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ చెబుతూ, అందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. వీరమల్లు కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశామనీ, అందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయన్నారు. భగవంతుడిని ఆశీస్సులు తమ టీమ్ పై ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement