Saturday, May 21, 2022

Salute: ఏడు కుటుంబాలలో వెలుగులు నింపిన కానిస్టేబుల్

తన కుటుంబ క్షేమం కన్నా సమాజ క్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసులు.. తన మరణాంతరం కూడా తన ఆవయవదానం చేసి సమాజంలోని ఏడు కుటుంబాల్లో వెలిగించాడు ఓ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఫిర్యాదుల విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సెల్వం సతీశ్.. మూడు క్రితం విధులకు హజరయ్యేందుకు తన సహోద్యోగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఖమ్మం-హనుమకొండ ప్రధాన రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్యాస విడిచాడు. ఈ సంఘటనతో కన్నీరుమున్నీరై విలపిస్తున్న సతీష్ కుటుంబ సభ్యులు.. సతీష్ ఆశయాలకు జీవపోయాలనే నిర్ణయించారు. సతీష్ మరణించినా.. నలురుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సతీష్ పార్థీపదేహం నుండి ఆవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన సతీశ్ కుటుంబ సభ్యులను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అభినందించారు. 2009 బ్యాచ్ కానిస్టేబుళ్లతో పాటు సహోద్యోగులు అశ్రునయాలతో సతీష్ కు తుది వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement