Friday, March 29, 2024

F3 Trailer: ఎఫ్-3 ట్రైలర్ వచ్చేంది

ఈ వేసవిలో పుల్ గా నవ్వుకోవడానికి రెడీ అయిపోండి. హాట్ హాట్ సమ్మర్లో కూల్ చేయాడానికి ఎఫ్-3 బ్యాచ్ రానుంది. 2019 సంక్రాంతి కానుకగా వచ్చి బంపర్ హిట్ కొట్టిన ‘ఎఫ్‌-2’కు సీక్వెల్ గా ‘ఎఫ్‌-3’ విడుదలకు సిద్ధమైంది. ‘ఎఫ్‌-2’ సాధించిన విజయంతో ఎఫ్ 3 మూవీ రెడీ అయింది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే చిత్ర నుంచి విడుద‌లైన టీజర్స్ సినిమాపై హైప్ పెంచాయి. తాజగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వెంకి, వరుణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, సోనాల్‌చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ట్రైల‌ర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంది. ఈ చిత్రం మే 27న విడుద‌ల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement