Friday, April 19, 2024

Afghans: ఆఫ్గాన్ లో ఆకలి కేకలు.. కిడ్నీలు అమ్ముకుంటున్న ప్రజలు

తాలిబన్లు పాలనలో ఆఫ్గనిస్తాన్‌లో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. పొట్ట కూటి కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రపంచ దేశాలేవీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సుముఖంగా లేకపోవడం… అంతర్జాతీయ సంస్థల నుంచి అందాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది.

గతేడాది ఆగస్టులో ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. అనంతరం దేశంలో ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతూ వస్తోంది. ఉద్యోగ, ఉపాధి లేక, తినడానికి తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. దేశంలో పేదరికం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో ఉన్న వస్తువులు అమ్ముకుని.. ఆ డబ్బులతో పొట్ట నింపుకుంటున్నారు. చాలామంది పేదలు కిడ్నీలు అమ్ముకుని.. ఆ డబ్బుతో కుటుంబాలను పోషిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఆఫ్గన్‌కి చెందిన యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. గతేడాది తాను 85 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. ఆఫ్గన్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు దాదాపు రూ.6లక్షలు వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో కిడ్నీ ఖరీదు రూ.1.60 లక్షల వరకు ఉంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ పోషణ కోసం చాలామంది పేదలు కిడ్నీలను అమ్ముకుంటున్నారని… కానీ దాని కారణంగా దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement