Thursday, April 25, 2024

Breaking: తెలంగాణలో పండుగ సెలవుల పొడిగింపు? ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లు బంద్..

కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా.. తాజాగా స్కూళ్లను కూడా మూసివేస్తున్నాయి. తెలంగాణలో సైతం పాఠశాలలకు సెలవులు పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ దేశంలో బాగా కనిపిస్తోంది. ప్రతిరోజూ భారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలతో పాటు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల్ని పొడిగించే దిశగా విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణలో జనవరి 8 నుంచి 16 వరకూ సంక్రాంతి సెలవులున్నాయి. 17వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెర్చుకోవల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సెలవుల్ని పొడిగించాలనేది విద్యాశాఖ అధికారుల ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. 

ఢిల్లీలో కఠిన ఆంక్షలు.. బార్లు, రెస్టారెంట్లు బంద్..

కాగా, కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. అక్కడ ఈ రోజు నుంచి ప్రైవేటు కార్యాలయాలన్నీ అన్నీ మూసి వేయాలని, వర్క్ ఫ్రమ్ హోం మాత్రమే చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది సర్కారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, బార్లు అన్నీ బంద్ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. కేవలం టేక్ అవేలకే మాత్రమే చాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement