Wednesday, April 24, 2024

పేలిన మోర్టార్ షెల్.. ముగ్గురు మృతి

ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల ఒక మోర్టార్ షెల్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించ‌గా, మరో ముగ్గురు గాయపడ్డ ఘ‌ట‌న‌ బీహార్‌లోని గయా జిల్లాలో జరిగింది. బారచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్వేడ్ గ్రామం పరిధిలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ ఉంది. అయితే బుధవారం ఉద‌యం ఆ ఫైరింగ్‌ రేంజ్‌ బయట ఒక మోర్టార్ షెల్ పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని అనుగ్రహ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు గ్రామస్తులు మరణించారు. కాగా, మోర్టార్ షెల్‌ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడి మరణించిన ముగ్గురు గ్రామస్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో మహిళతోపాటు ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement