Thursday, April 18, 2024

వ్యాయామం చేస్తూ వెయిట్ లిఫ్ట‌ర్ మృతి – జాతీయ‌స్థాయిలో స‌త్తా చాటిన రాజా ర‌ఘురామ్

ప్ర‌ముఖ వెయిట్ లిఫ్ట‌ర్ వీర‌మాచినేని రాజా ర‌ఘురామ్ మ‌ర‌ణించాడు. జిమ్ లో వ్యాయామం చేస్తూ అస్వ‌స్థ‌త‌కు గుయి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళిపోయాడు. దాంతో అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. కృష్ణాజిల్లా హ‌నుమాన్ జంక్ష‌న్ కి చెందిన రఘురామ్ హనుమాన్ జంక్షన్ లో రా జిమ్ సెంటర్ నడుపుతున్నాడు. ప్రతిరోజూ ఈ జిమ్ లోనే వ్యాయామం చేస్తుంటాడు. ఇలా నేడు వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం వీరమాచినేని రాజారఘురామ్ వయసు కేవలం 29ఏళ్లే. ఇంత చిన్న వయసులో అతడు చనిపోవడం క్రీడా ప్రియులనే కాదు ఏపీ ప్రజలకు బాధిస్తోంది.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, శరీరాన్ని ఫిట్ గా వుంచుకునేందుకు వ్యాయామం చేయాలని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చని చెబుతుంటారు. కానీ ఇదే వ్యాయామం ఇటీవల ప్రాణాలను బలితీసుకుంటోంది. శరీరం తట్టుకునే స్థాయికి మించి వ్యాయామాలు చేయడం వల్ల అనర్ధాలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయి వెయిట్ లిప్టింగ్ ఫోటీల్లో తెలుగువాడి సత్తాను దేశానికి తెలియజేసిన ఘ‌న‌త ఇత‌నిదే. ఏపీ తరపున అనేక జాతీయస్థాయి ఫోటీల్లో పాల్గొన్న ఆయన పతకాలు సాధించారు. ఇలా ఏపీ పేరునే కాదు పుట్టిపెరిగిన హనుమాన్ జంక్షన్ పేరును దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement