Thursday, March 28, 2024

తెలంగాణ SI, ASI పోస్టుల పరీక్ష తేదీలివే…

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. TSLPRB తెలంగాణాలో ఉన్న ఎస్సై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్షా హాల్ తేదీలు ఈ రోజు సదరు శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత అదే తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక అభ్యర్థులు తమ హాల్ టికెట్ లను సోమవారం నుండి అంటే ఏప్రిల్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని TSLPRB కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement