Thursday, April 25, 2024

బీజేపీలోకి మాజీ ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. గండిపేటలోని డీకే అరుణ ఫాంహౌజ్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా డీకే అరుణ విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు. అయితే, దీనికి కొండా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ వ్యతిరేకులు అందరూ ఒకే వేదికపైకి రావాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరడం ఖాయం అయింది. అయితే, కొద్ది రోజుల ముందే ఈటలతో మాజీ ఎంపీ కొండా సమావేశం అయ్యారు. బీజేపీలో చేరే అంశంతోపాటు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఐక్యంగా ఓ వేదికను ఏర్పాటు చేసే విషయంపై మాట్లాడారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో బీజేపీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించిన ఈటల కాషాయ పార్టీకి దగ్గరైయ్యారు. ఇక ఇప్పుడు డీకే అరుణతో కొండా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ కొండా రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement