Thursday, April 25, 2024

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రూ హిందువే.. కేర‌ళ గ‌వ‌ర్నర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హిందూ అనేది మ‌త‌ప‌ర‌మైన ప‌దం కాద‌ని..భౌగోళిక ప‌ద‌మ‌ని కొత్త భాష్యం చెప్పారు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్. ఈ మేర‌కు ఆయ‌న తాను హిందువేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించే వారినందరినీ హిందువులనే పిలవాలన్నారు. భారతదేశంలో పుట్టినా, భారతదేశంలో పుట్టిన గింజలు తిన్నా.. ఇక్కడి నదుల నీరు తాగినా.. అలాంటి వారిని హిందువుగా పిలువడానికి అర్హులని చెప్పారు. బ్రిటీష్ వారు మతం ఆధారంగా మనల్ని విభజించడం వల్లనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన మలయాళీ హిందువులు తిరువనంతపురంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీబీసీ డాక్యుమెంటరీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను వంద ముక్కలుగా చూడాలనుకునే వారు కలత చెందుతున్నారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మన దేశాన్ని చీకట్లో చూడాలనుకునే వారి కుట్రలే ఇవి అని అన్నారు.ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై ఎంత దుమారం రేగ‌నుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement