Thursday, March 28, 2024

జీవితాంతం కేసీఆర్ కు ఊడిగం చేసినా నాస్థాయికి రాలేవు.. త‌ల‌సానికి రేవంత్ కౌంట‌ర్

జీవితాంతం కేసీఆర్ కు ఊడిగం చేసినా త‌న స్థాయికి రాలేవ‌ని మంత్రి త‌ల‌సానికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంట‌రిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో బోర్డ్ సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

పెండ పిసికి, దున్నపోతులు కాసే… తలసాని త‌న గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు రేవంత్‌. పెండ పిసికి, దున్నపోతులను కాసే, పాన్ పరాకులు తినే తలసాని కూడా త‌న గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా త‌నలా అధ్యక్షుడు కాలేడని ఫైర్‌ అయ్యారు. కేంద్ర సర్వీస్ ఛార్జీలు ఇప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement