Wednesday, April 24, 2024

నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు.. కోట శ్రీనివాసరావు (వీడియోతో)

తాను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దని టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని… ఆయన మరణించినట్లు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు… ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం ఆయన మరణించినట్లు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు. అయితే ఈ వార్తలపై స్వయంగా కోట శ్రీనివాసరావు స్పందించారు. తాను ఇంకా బతికే ఉన్నానని… కొంతమంది సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను నిజంగానే చనిపోయానని పోలీసులు కూడా తన ఇంటికి వచ్చారని తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కోట శ్రీనివాసరావు అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement