Saturday, March 25, 2023

ఆర్ ఆర్ ఆర్ లోని ఎత్త‌ర జెండాసాంగ్ లో – రాజ‌మౌళి

ఆర్ఆర్ఆర్ లోని ప్రమోషనల్ సాంగ్ ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంత‌కు ముందు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ల డాన్స్ గురించి అందరు మాట్లాడుకునే వారు. కానీ ఈ సాంగ్ లో మాత్రం చివరన వచ్చే ద‌ర్శ‌కుడు రాజమౌళి డాన్స్ గురించి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలో ఎండ్ టైటిల్స్ పడే సమయంలో ‘ఎత్తర జెండా’ పాట వస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్, తారక్ మధ్యలో అలియా తమదైన డాన్స్ స్టెప్పులతో దుమ్ము లేపేయగా చివరన చిత్ర బృందం మొత్తం సాంగ్ లో స్టెప్స్ వేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. అజయ్ దేవగన్, హాలీవుడ్ భామ ఒలివియాతో పాటు రాజమౌళి కూడా డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా .. విశాల్ మిశ్రా ,పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి , హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement