Tuesday, April 16, 2024

కుల రాజకీయం దుర్మార్గం.. ఈటల ఆవేదన!

కులాల ప్రాతిపదికన రాజకీయాలు జరిగే దుర్మార్గపు ఆలోచన ఇక్కడే ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 94వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు  చేశారు. సమాజంలో బలహీన వర్గాల వారు రెండవ శ్రేణి పౌరులుగా, వెనుకబడిన వాళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు.

కులాలను బట్టి గౌరవించే దుర్మాగ్గపు పరిస్థితిని చూస్తున్నామని, మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఆత్మగౌరవ సమస్య.. చైతన్యాన్ని చంపితే ఉన్మాదమే వస్తుందన్నారు.  ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కింది కులాల మీద ఉందన్నారు. జానెడు భూమి కోసం ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వమే భూములను పేదలకు పంచుతుందని తెలిపారు. పట్టా భూముల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. పేదలు సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములు వారికే అందించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. సమాజంలో అంతరాలు పోయేంత వరకు మనం అందరం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య విగ్రహం కోసం సీఎంకి విజ్ఞప్తి చేస్తానని ఈటల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement