Friday, September 22, 2023

రైల్వే, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. మోడీ

రైల్వే ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. రూ.6300కోట్లతో ఆర్ఎఫ్ సీఎల్ ప్లాంట్ పునరుద్దరణ, భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మూడు హైవేల విస్తరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ ప్రధాని మోడీ ముందుగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రామగుండం గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నమస్కరిస్తున్నానన్నారు. ఈ సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement