Thursday, April 18, 2024

ఎలాన్ మ‌స్క్.. దేశీ వ‌రుడు ఐతే

ఏఐ ఏమైనా సృష్టించ‌గ‌ల‌దు. ప్రపంచంలోనే అత్యంత కుబేరులు బికారులైతే (పేదవారు) ఎలా ఉంటారు, స్టార్‌ క్రికెటర్లు, స్టార్‌ హీరోలు అమ్మాయిలైతే ఎలా ఉంటారో ఊహిస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు ఇప్పటికే నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్ దేశీ వరుడు అయితే ఎలా ఉంటాడో వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌, ఏఐ ఆర్టిస్ట్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ ఫొటోల్లో మస్క్‌ సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రంపై ఊరేగుతున్నట్లు కనిపించాడు. మరికొన్ని ఫొటోల్లో నవ్వుతూ.. వేడుకను ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. అద్భుతం.. , నమ్మలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మస్క్‌ దేశీ వరుడి లుక్ ని మీరూ చూడండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement