Friday, April 19, 2024

ట్విట్ట‌ర్ లో ఇండియా ఎంప్లాయిస్ 80మంది.. వీర‌యినా ఉంటారో .. మానేస్తారో

ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ని స్వాధీనం చేసుకున్న ద‌గ్గ‌ర నుంచి ఎన్నో వివాదాల్లో నిలుస్తూ వ‌చ్చారు. భారత్ లో ట్విట్టర్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మొత్తం 250 మంది ఉద్యోగులకు గాను 170 మందికి గుడ్ బై చెప్పేసింది. దీంతో ట్విట్టర్ కు భారత్ లో కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. అంటే ఇప్పటి వరకు 250 మంది సంయుక్తంగా చేసిన పనిని.. ఇక మీదట కేవలం 80 మంది ఉద్యోగులే నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఎలాన్ మస్క్ వంటి వ్యాపారవేత్తల నయా శ్రమ దోపిడీకి ఇది నిదర్శనం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కార్యాలయాల పరిధిలో ఈ 80 మంది పనిచేస్తున్నారు. మిగిలిన ఈ కొద్ది మందే ఎక్కువ పనిభారాన్ని మోయాల్సిన పరిస్థితుల్లో ఏ కంపెనీ అయినా అదనపు ప్రయోజనాలు ఇస్తుంది. కానీ, ఇక్కడ సీన్ వేరు. ఇప్పటి వరకు ట్విట్టర్ ఉద్యోగులకు భారత్ లో స్నాక్స్ ఇస్తుండగా, మస్క్ వాటికి ముగింపు పలికారు. మ‌రి ఈ ఉద్యోగుల‌యినా ఉంటారో..మానేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement