Thursday, April 25, 2024

హుజురాబాద్‌ ఉపఎన్నికకు ఈసీ రెడీ!

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీలకు ఇప్పటికే సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. రాబోయే రెండు, మూడ్రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది.

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈసీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బీజీ అయ్యాయి. ఎన్నికకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ తరుపున ఇప్పటికే ఈటల బరిలో ఉండగా.. టీఆర్ఎస్ తరుపున బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు.

మరోవైపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం నిలిచిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకివ్వరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement